: దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు సన్నద్ధం అయ్యారు మన నిర్మాతలు.అన్ని సినిమాల కంటే ఒక రోజు ముందుగానే విడుదలవుతున్న తాజా చిత్రం"మహాసముద్రం".ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ ఇద్దరు హీరోలుగా నటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఇప్పటికే మంచి సక్సెస్ను అందుకున్నాయి.

ఇక ట్రైలర్ కూడా సరికొత్త గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా rx100  డైరెక్టర్ అజయ్ భూపతి సినిమాని తెరకెక్కించడం జరిగింది.అందులో ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమా విడుదలైన మొదటి రోజు చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆతృతతో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.


ఈ సినిమాలు మహాసముద్రం అనే పదం హీరోయిన్ పేరు ని ఇండికేట్ చేస్తూ ఉంటుందని. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.ఇక మహా సముద్రం సినిమాలో మహా పాత్ర ఎ హీరోయిన్ ని చూపించారో మాత్రం తెలియజేయలేదు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇక తాజాగా ఈ సినిమాలో మహా పాత్ర కి ముందుగా స్టార్ హీరోయిన్ సమంతని సంప్రదించారట.

సినిమా కథను నాగచైతన్య సమంతకు డైరెక్టర్ ఈ కథను చెప్పగా..చైతు చేస్తే ఈ సినిమాలో నేను కచ్చితంగా నటిస్తానని అని చెప్పుకొచ్చింది సమంత. కానీ కొన్ని కారణాల చేత నాగ చైతన్యసినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ అయ్యాడు. ఇక ఇదివరకే సమంత జాను సినిమాలో నటించింది. వీరి నటనకు మంచి మార్కులే వచ్చాయి కానీ సినిమా మాత్రం ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది. ఇక అందుచేతనే ఈ సినిమాలో సమంత తప్పుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: