మా ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మరియు ఉత్కంఠభరితంగా సాగిన సంగతి మనందరికీ విధితమే. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే రాజకీయ ఎన్నికల తరహాలోనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఉప ఎన్నికలు ఈ నెల 10వ తేదీన పూర్తి అయ్యాయి. అలాగే అదే రోజున మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ పోలింగ్ రోజున... డైలాగ్ కింగ్ మోహన్ బాబు... ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు.  ఈ తరుణంలోనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా మోహన్బాబు చేశారు.  

" అసలు ఏం జరుగుతోంది.  ఇవి ఎన్నికలా ? కదా?. నాన్సెన్స్. అందరూ నిరక్షరాస్యులే. అందరూ చూస్తున్నారు. గొర్రెలు కాసే వాని దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది. వాళ్లు మన గొడవలను రికార్డ్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. అసలు గొడవ ఎందుకు ? " అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మోహన్ బాబు. అయితే ఆయన మాట్లాడిన మాటలు... తమ మనోభావాలను దెబ్బతీసాయని... రాష్ట్ర గొర్రెలు మరియు మేకల కాపలా దారుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇందులో భాగంగానే రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం నేతలు మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదు చేశారు. గొర్రె కాపురులను చిన్నచూపుతో చూసినట్లు మాట్లాడడం చాలా దారుణం అని... మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో డిమాండ్ చేశారు. రాష్ట్ర గొర్రెలు మరియు మేకల కాపు దారు ల అంద రికీ  మోహ న్ బాబు క్ష మాప ణ చెప్పా లని ... లేదం టే ఏం చేయా లో  అది చేస్తా మని హెచ్చ రించారు ఆ సం ఘం నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: