అక్కినేని యంగ్ హీరో అఖిల్ హిట్ ఫ్లాప్ లని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మొదటి సినిమా "అఖిల్" ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత డైరెక్టర్ విక్రమ్ కుమార్ . కె డైరెక్షన్ లో హలో అంటూ లవ్ స్టోరీతో పలకరించిన అఖిల్ కెరియర్ కి కలిసి రాకపోగా తీవ్ర నిరాశనే మిగిల్చింది. అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఎన్నో ఆశలతో తీసిన మిస్టర్ మజ్ను చిత్రం కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోర్లా పడి అఖిల్ కి హ్యాండ్ ఇచ్చింది. ఇక ఇటీవల తాజాగా విడుదలైన అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రం అఖిల్ ఖాతాలో తొలి సూపర్ హిట్ ను వేసి తన కెరియర్ కి జోషిచ్చిందనే చెప్పాలి.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూజ హెగ్డే అఖిల్ కి లక్కీ హీరోయిన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ హీరోయిన్ తో వరుస చిత్రాలు చేయండి బాస్ అంటూ చాలా మంది అడుగుతున్నారట. దాంతో ఫ్యాన్స్ కోసం అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ లో కూడా పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ వెండి తెరపై అఖిల్, పూజ ల జోడీ మాత్రం నిజంగా మ్యాజిక్ చేసింది.

మరో సారి ఆ మ్యాజిక్ ను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఉన్న తరుణంలో వీరి కాంబో లో నెక్స్ట్ మూవీ వస్తోంది ఏమో చూడాలి. అయితే సాధారణంగా తమకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ లతో సినిమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలోనే వీరి నుండి మరో సినిమా ఆశించవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: