హీరోయిన్ అవ్వాలనే కోరికతో తానే స్వయంగా నాట్యం సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి దర్శకుడు గా రేవంత్ కోరుకొండ వహించారు. ఇక ఈమె తో పాటుగా ఎంతో మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించడం ఒక విశేషం. అయితే ఈ సినిమా పాపులర్ కోసం ఎంతో మంది నటులు ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ సంధ్యారాజు ఎవరు అనే విషయం పై ప్రేక్షకులు ఎక్కువగా వెతుకుతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా రామ్ చరణ్ హాజరు కావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ వంటి వారు ఏకంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఎలాంటి పేరు లేని ఈ సంధ్యా రాజు హీరోయిన్ గా తొలి పరిచయం అవుతుంటే ,ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు స్టార్ హీరోస్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈమె మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే సంధ్య రాజు ఒక కూచిపూడి నాట్య కళాకారిణి. ఇక ఈమె ఒక బిజినెస్ మ్యాన్ కూతురు.. ఇక మరొక బిజినెస్ మ్యాన్ కోడలు కూడా ఈ సంధ్యా రాజు. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి.. రామ్ కో గ్రూప్ చైర్మన్ "వెంకట్ రామ రాజా కూతురు ఈమె. ఇక అంతేకాకుండా సత్యం కంప్యూటర్ ఒకరు రామలింగరాజు కోడలు కూడా. ఇతని చిన్న కుమారుడు కి ఈ సంధ్య రాజు ను ఇచ్చి వివాహం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి