ఇప్పటివరకూ సినీ ప్రేక్షకులు అందరూ వెండి తెర పైన సూపర్ స్టార్ లను మాత్రమే చూసి ఉంటారు. కానీ బుల్లితెరపై కూడా సూపర్ స్టార్లు ఉంటారని హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటారు అని నిరూపించాడు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ కామెడీ షో లో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినా సుడిగాలి సుదీర్ ఇక ఇప్పుడు అంతకంతకు క్రేజ్  సంపాదించుకున్నాడు. బుల్లితెర సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఏకంగా ఒక హీరో లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలిసుధీర్. ఎంత ఎదిగినా కూడ ఎప్పుడూ ఒదిగి ఉంటాడు.



 అయితే ఎంత క్రేజ్ ఉన్నప్పటికి సుడిగాలి సుదీర్ ఒదిగి ఉండడం మాత్రం ఇంకా ఎంతోమంది అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఈటీవీలో డాన్స్ రియాలిటీ షో అయిన ఢీ లో కూడా టీం లీడర్ గా కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్.  అయితే సుడిగాలి సుధీర్ టీం లీడర్ గా ఉన్నాడు అంటే చాలు ఇక మిగతా వారందరూ కూడా సుధీర్ పై ఏదో ఒక విధంగా పంచులు వేసి అందరినీ నవ్విస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నోసార్లు సుధీర్ ని రసికరాజ అని పిలుస్తూ ఉంటారు.



 సుధీర్ ఎంతో రొమాంటిక్ అని ఎప్పుడూ అమ్మాయిల వెంటపడుతుంటాడు అంటూ అప్పుడప్పుడు పంచులు వేయడం చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఢీ షో లో భాగంగా జడ్జిగా ఉన్న పూర్ణ యూట్యూబ్ ఛానల్ లో లాగ్స్ చేసినట్లుగానే ఇక ఢీ సెట్ లో కూడా లాగ్స్ చేయడానికి చేస్తున్న క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక సుడిగాలి సుదీర్ దగ్గరికి వెళ్తున్న సమయంలో సుధీర్ కెమెరా ఆఫ్ అయిన తర్వాత సుధీర్ ఎలా ఉంటారో చూపిస్తాను అంటూ లైట్స్ ఆఫ్ చేయండి అని చెప్తుంది. లైట్స్ ఆఫ్ చేయగానే కిస్ ఇచ్చిన శబ్దం చేస్తుంది. లైట్ ఆన్ కాగానే షాక్ అవుతుంది పూర్ణ. చూశారా లైట్స్ ఆఫ్ అయితే సుధీర్ ఎంత రొమాంటిక్ అంటూ పూర్ణ చెబుతుంది. దీంతో షాక్ అయిన సుధీర్ అలా అనకండి యూట్యూబ్ వాళ్ళు ఏదో ఒకటి రాస్తారు అంటూ బ్రతిమిలాడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: