ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కన్ను కూడా బిగ్ బాస్ హౌస్ పైనే ఉందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచే కంటస్టెంట్స్ మధ్య గొడవలు మొదలు కావడంతో ఇక అటు ప్రేక్షకులకు కూడా అంతకంతకూ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోతుంది. ప్రతి సోమవారం కూడా బిగ్బాస్ హౌస్ నామినేషన్స్ వేడి రాసుకుంటుంది. ఇక ఆ వేడి వారాంతం వరకు  కొనసాగుతూనే ఉంటుంది. ఇక మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్..  టాస్కూల్లో కంటెస్టెంట్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు అని చెప్పాలి. ఇక వారాంతంలో ఎంతో వేడి వేడిగా ఉన్న బిగ్ బాస్ హౌస్ ను  నాగార్జున వచ్చి కూల్ చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి వార్నింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే బిగ్బాస్ కెప్టెన్సీ కోసం టాస్క్ ప్రారంభం చేశారు.  కాగా ప్రస్తుతం కెప్టెన్సీ దక్కించుకోవడానికి ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఎంతగానో పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ పోటీదారులు ఎంపిక కోసం ఒక వినూత్నమైన ప్లాన్ వేసాడు బిగ్బాస్. ఈవారం ఇంటి సభ్యులకు అభయ హస్తం అనే టాస్క్ ఇస్తున్నట్లు బిగ్బాస్ సూచించాడు. ఇక అభయహస్తం టాస్క్ లో భాగంగా బిగ్బాస్ ఇంటిని మొత్తం లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన అభయహస్తం టాస్క్ లో ఎవరు అయితే విజయం సాధిస్తారో వాళ్లు కెప్టెన్సీ పోటీలోకి ఎంట్రీ సాధించడంతోపాటు ఇక ఇంటి లోపలికి కూడా వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంటారు.  ఇక బిగ్బాస్ ఈ రూల్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే అభయ హస్తం టాస్క్ కు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్, లోబో హోరాహోరీగా  పోటీ పడ్డారు. బురదతో తో నిండిన టబ్  నుంచి కాయిన్స్  సేకరించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా లోబో కాజల్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: