ఈ వెబ్ సిరీస్ కు "3 రోజెస్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. నవంబర్ 12న ఈ సిరీస్ ను ఆహా యాప్ లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి మారుతి పర్యవేక్షణలో మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకోనుందో చూడాలి. పలు సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో కూడా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో మనల్ని అలరించేందుకు మన ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ సంబంధించి టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇందులో ఇషాన్, సంగీత్ శోభన్, ప్రిన్స్ , సత్యం రాజేష్ , గోపరాజు రమణ,హేమ, వైవా హర్ష వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా మారుతీ డైరెక్ట్ చేసిన మంచిరోజులొచ్చాయి మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లో ప్రదర్శితం అవుతోంది. ఇందులో సంతోష్ శోభన్ మరియు మెహరీన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి