మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నర్సింహారెడ్డి. ఈ సినిమాని ఉయ్యాల వాడ నర్సింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించారు. ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో కాకపోయిన మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. అలాగే నందమూరి బాలయ్య తొలుత సమరసింహా రెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అనంతరం బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాను తెరకెక్కించగా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే సందీప్ హీరోగా తెరకెక్కిన జార్జ్ రెడ్డి సినిమా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా జాంబిరెడ్డి. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే బీజేపీ నేత జితేందర్ రెడ్డి నటించిన సర్ధార్ చిన్నపరెడ్డి సినిమా కూడా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. నాగ చైతన్య హీరోగా రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శైలజారెడ్డి అల్లుడు. ఈ సినిమా అనుకునంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక 1980లో శారద కీలకపాత్రలో కడప రెడ్డమ్మ సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకునంతా విజయం అందుకోలేదు. మొత్తాన్ని రెడ్డి సినిమాతో వచ్చిన పలు సినిమాలు విజయాలను అందుకోగా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి