నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంకా బ్లాక్ బస్టర్ యువ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. బోయపాటితో బాలయ్య చేస్తున్న అఖండ సినిమా విడుదల అవ్వగానే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న బాలయ్య ఇక ఆ సినిమా ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే కమిట్ అవ్వడం జరిగిందట.ఇక వీరిద్దరి కాంబోలో రామారావు గారు అనే టైటిల్ తో మూవీ రావాల్సి ఉందట. కాని ఆ  సినిమా ఆలస్యం అవ్వడంతో ఈలోగా రామారావు టైటిల్ ను మాస్ మహారాజా రవితేజ దక్కించుకోవడం జరిగింది.రామారావు ఆన్ డ్యూటీ అంటూ రవితేజ ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి చేస్తున్నాడు. దాంతో బాల కృష్ణ కోసం అనీల్ రావిపూడి మరో కొత్త టైటిల్ ను ఆలోచిస్తున్నాడట. సినిమా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు కోసం ఎన్ బీ కే అనే సూపర్ టైటిల్ ను అనీల్ రావిపూడి ఆలోచిస్తున్నాడని.. బాల కృష్ణ కూడా అందుకు పూర్తిగా తన సుముఖతని వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో అంటున్నారు.

ఇక అనీల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈనెల చివరి వరకు ఎఫ్ 3 సినిమాని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ లు హీరోలుగా మెహ్రీన్ ఇంకా తమన్నాలు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కమెడియన్ సునీల్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎఫ్ 2 మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఇక ఆ తర్వాత అనిల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ లాంటి బిగ్ స్టార్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డులు తిరగరాసిన సినిమాగా విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎఫ్ 3 సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ని దక్కించుకుంటే ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా కు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి బాల కృష్ణతో ఎఫ్ 3 వంటి ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి వున్నాడనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: