కరోనా తర్వాత అన్ని పరిశ్రమలకు కష్టాలు అంటే ఏమిటో తెలిసొచ్చాయి. లాక్ డౌన్ కారణంగా అన్నీ పరిశ్రమలు మూతపడడంతో జీవిత రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు అందరూ వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రణాళికలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ ఒక మంచి ఆదాయ వనరుగా ఉంది. అందుకే రాజకీయ నాయకులు మరియు ఇతర రంగాల నుండి ఎంతో మంది సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్స్ గా ఉన్న హీరో హీరోయిన్లు కూడా నిర్మాతలుగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెల్సిందే.

ఇప్పటికే దాదాపుగా హీరోలు అందరూ ఏదో ఒక విధంగా సినిమా రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. కొందరేమో నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలోకి ఒక స్టార్ హీరోయిన్ వచ్చి చేరబోతున్నట్లు సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆమె ఎవరో కాదు... వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ వెళుతున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఈమెకు గతంలో కిచ్లు తో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే.  భర్త కోరిక మేరకే ఈ నిరన్యం తీసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

మరి ఒక హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న కాజల్ నిర్మాతగానూ రాణిస్తుందా? ఇప్పటి వరకు ఈ వార్తపై అధికారిక సమాచారం లేదు. హీరోయిన్ లు నిర్మాతలుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. అప్పట్లో సావిత్రి, విజయనిర్మల లు నిర్మాతగా సక్సెస్ అయినవారే. మరియు నేటి సంగతికి వస్తే ఛార్మి నిర్మాతగా పూరి జగన్నాధ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ బాటలోనే ఉన్నారు. త్వరలోనే నిజమవ్వాలని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ "ఆచార్య" లో చిరంజీవి సరసన నటిస్తున్నారు. కాగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: