ఏ టాస్క్ ఇచ్చినా కూడా 100% ఆడుతూ ఉండేవాడు. అంతే కాదు హౌస్ లో ఏ పని అప్పజెప్పిన కూడా ఎంతో ఓపికగా చేసేవాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో అందరి చేత సూపర్ హీరో అనిపించుకున్నాడు విశ్వ. అదే సమయంలో కాంట్రవర్సీ లకు ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన విశ్వ ఇప్పటివరకు ఎక్కడ మీడియా కంట పడలేదు. ఏ ఇంటర్వ్యూ లకు కూడా వెళ్లలేదు.
అయితే ఇటీవలే ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ప్రేక్షకులు ఇచ్చిన ఓటింగ్ ని తాను స్వాగతిస్తున్నట్లు అంటూ తెలిపారు. ఇక అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ గురించి కూడా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో లోబో తనకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయాడని చెప్పుకొచ్చాడు విశ్వ. అప్పటివరకు లోబో తో పరిచయం ఉన్నప్పటికీ అంత క్లోస్ కాలేదు అని తెలిపాడు. ఇక బిగ్ బాస్ నాకు ఇచ్చిన ఒక గ్రేట్ గిఫ్ట్ అదే అంటూ విశ్వ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి