టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం బిగ్బాస్. ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది ఈ కార్యక్రమం.  ఇక ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. అయితే ప్రతి వారాంతంలో నాగార్జున వచ్చి సందడి చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఆదివారం రోజున ఎంతో సందడి చేసి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచాడు నాగార్జున. ఇక నేడు మరోసారి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.


 ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ అంటే హౌస్ మొత్తం ఎంత హాట్ హాట్ గా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారు ఒక్కసారిగా సీరియస్ అవుతారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేషన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇటీవలే మరో సారి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ వేడి రాజుకుంది. ఇటీవలె  నేడు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియా లో విడుదలైన వైరల్ గా మారిపోయింది.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చెబుతున్న కారణాలు చూస్తుంటే కెప్టెన్గా ఉన్న రవి మినహా మిగతా అందరు కూడా నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే కెప్టెన్గా ఉన్న రవి అటు సన్నీ ని నామినేట్ చేస్తాడు. అంతేకాకుండా కాజల్ ని కూడా నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షణ్ముక్... నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అని నేను అనుకుంటున్నాను కాజల్ అంటూ కాజల్ ను నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత మనస్ షణ్ముఖ్ తో పాటు మరొకరిని కూడా నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారు అన్నది మాత్రం నైట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: