టాప్ హీరోలు ఏం చేసినా విశేషమే, వారి వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేందుకు అందరూ తెగ ఆసక్తి చూపుతారు. ఈ కారణంగా వారి భార్యలు , పిల్లలు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. కొందరు హీరోల భార్యలు అయితే తమ నైపుణ్యాలు, సేవాకార్యక్రమాలు, సోషల్ మీడియా ఇలా పలు రకాలుగా గుర్తింపును పొందుతున్నారు. దాంతో ఆ నటుల భార్యలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వైరల్ గా మారుతుంటాయి. అయితే మనం ఇపుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఆమె గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ బ్యాక్ గ్రౌండ్ లో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినా  డ్యాన్స్ లో కొత్తదనం ఆ స్టైల్, గ్రేస్, డైలాగ్ డెలివరీ, నవరసాలను పిండేయగల నటన ఇలా అన్ని యాంగిల్స్ ను కలగలిపి ఎప్పటికప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకున్నాడు. ఇక ఈయన సతీమణి స్నేహ రెడ్డి కూడా ఇపుడు పెద్ద సెలబ్రిటీ అనే చెప్పాలి. ఎందుకంటే వీరి పెళ్లి అయినప్పటి నుండి ఆమె గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. దాంతో పాటు స్నేహ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక వీరి లవ్ స్టోరీ సినిమాకి మించిన పెద్ద స్టోరీ అన్నది తెలిసిందే. కాగా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇపుడు మాట్లాడుకుందాం.

అల్లు అర్జున్ 10 వ తరగతితో ఇక చదువు బంద్ అంటూ అక్కడితో పులుస్తాప్ పెట్టేసారు. ఇటు స్నేహ రెడ్డి ఏమో ఎంఎస్ చేశారు. అదికూడా అమెరికాలో అందులోనూ స్నేహ నాన్నగారు హైదరాబాద్ లోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు యజమాని. మరి ఈ ఇద్దరికీ పొంతన ఎలా కుదిరింది అని అనుకుంటున్నారా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదేనేమో. తన స్నేహితుల ద్వారా స్నేహ రెడ్డిని ఓ పార్టీ లో కలుసుకున్న బన్నీ, చూడగానే సోల్మెట్ అని ఫీల్ అయ్యారట. కొద్ది రోజులకు విషయం స్నేహకు చెప్పగా మొదట రిజెక్ట్ చేసిన స్నేహ...ఆ తర్వాత బన్నీ ప్రేమకు ఫిదా అయ్యి ఒకే చెప్పారట. మళ్ళీ ఇంట్లో ఒప్పుకోలేదు అదో సమస్య.

ఇంతలో విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి ప్రేమ కథ గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. దాంతో అల్లు అరవింద్ రంగంలోకి దిగి స్నేహ రెడ్డి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మొత్తానికి ఒప్పించారు. అలా మొత్తానికి చాలా అడ్డంకులను దాటుకుని అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ల వివాహం 2011 మార్చి 6వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఇపుడు ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ ఉన్నారు. అప్పుడప్పుడు వీరి వీడియోస్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వస్తు ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: