బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `అఖండ`(Akhanda) అని అందరికి తెలుసు.`సింహా`, `లెజెండ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల అనంతరం వస్తోన్న చిత్రమిదని సమాచారం..

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఈ చిత్రం డిసెంబర్‌2న విడుదల కాబోతుందని బోయపాటి మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో వస్తోన్న చిత్రమిదని తెలుస్తుంది.. ఈ సారి వాటికి అఘోర అనే ఎలిమింట్‌ ఈ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతుందట. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది.. అందులో ఒకటి అఘోర పాత్ర అని ఆయన ఇలాంటి విభిన్నమైన పాత్ర పోషించడం ఇదే ఫస్ట్ టైమ్‌ అని తెలుస్తుంది.. దీంతో సినిమాపై భారీ అంచనాలను పెంచిందని తెలుస్తుంది.

దీనికి తగ్గట్టుగానే భారీ ప్రమోషనల్‌ కార్యక్రమాలతో దూసుకుపోతుందట యూనిట్‌. ఇప్పటికే విడుదలైన అఖండ మూవీ టీజర్‌ మరియు ట్రైలర్‌ అంచనాలను ఆమాంతం పెంచేశాయట.బాలయ్య, ప్రగ్యాజైశ్వాల్‌ మధ్య డ్యూయెట్‌ సాంగ్‌ అదరగొడుతున్నాయట. మరోవైపు ట్రైలర్‌లో బాలయ్య విశ్వరూపం నెక్ట్స్ లెవల్‌లో ఉందని సమాచారం.. దీనికి తోడు శ్రీకాంత్‌ మరియు జగపతిబాబు విలన్లుగా లుక్స్ గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయని తెలుస్తుంది.బలమైన విలన్లు ఉండటంతో సినిమా మరింత రక్తికట్టిస్తుందని తెలుస్తుంది..

ఇదిలా ఉంటే చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉందని సినిమాకి సంబంధించి భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారట.ఈ నెల 27న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించిందట.చాలా గ్యాప్‌తో ఈవెంట్‌ని నిర్వహిస్తున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. అదే సమయంలో బాలయ్యని వెండితెరపై చూసి రెండేళ్లు అవుతుందట.చివరగా ఆయన `రూలర్‌` చిత్రంలో నటించారని ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందని తెలుస్తుంది.

మరోవైపు బాలయ్య నటించిన `గౌతమి పుత్రశాతకర్ణి` తర్వాత సక్సెస్‌ దక్కలేదని తెలుస్తుంది.. `పైసా వసూల్‌`, `జై సింహా`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌తోపాటు `రూలర్‌` చిత్రాల్లో నటించారని తెలుస్తుంది.. ఈ చిత్రాలన్నీ పరాజయం చెందాయట. దీంతో `అఖండ`పై భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారట బాలయ్య ఫ్యాన్స్ . మరి వారి అంచనాలను రీచ్‌ అయి బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొడతారా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: