మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిన హీరోలు ఉన్నారు. అలాగే ఒకే సినిమాతో స్టార్ అయిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీకి రచయితగా అడుగు పెట్టిన కొరటాల శివ, 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. మొదటి సినిమానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరో ని డైరెక్ట్ చేసే చాన్స్ అందుకున్నారు కొరటాల. ఇక మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రభాస్ కెరీర్లోనే ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. ఇక దర్శకుడిగా ఈ సినిమాతో కొరటాల శివ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

 మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల. ఇక ఈ సినిమాతో ప్రభాస్ ని ఒక డిఫరెంట్ స్టైల్ లో ఒక డిఫరెంట్ లుక్ లో చూపించాడు కొరటాల. అప్పటివరకు ఉన్న ప్రభాస్ మేక్ఓవర్ మొత్తాన్ని మార్చేశాడు. మాస్ గా చూపిస్తూనే క్లాస్ లుక్ లో కూడా ప్రభాస్ ని చాలా బాగా చూపించాడు. ఇక ఈ సినిమాకి కొరటాల శివ రాసుకున్న కథ, కథనం అందుకు ఆయన రాసుకున్న డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి ఒక పవర్ ఫ్యాక్డ్ మూవీని ప్రేక్షకులకు అందించాడు. 2013 ఫిబ్రవరి 8 న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక కొరటాల శివ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కూడా..

 మిర్చి సినిమాతోనే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి మొదటి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముఖ్యంగా పలు విభాగాల్లో నంది పురస్కారాలు దక్కాయి. ఈ సినిమాకి ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ కళా దర్శకుడు, వంటి పలు విభాగాల్లో నంది అవార్డ్స్ వచ్చాయి. ఇక మిర్చి సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు కొరటాల శివ. మొదటి సినిమాకే నంది అవార్డు రావడం అనేది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు కొరటాలశివ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. మిర్చి నుంచి మొదలుకొని శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కొరటాల శివ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: