సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో విషాద చాయలు చోటుచేసుకున్నాయి. అయితే నిన్నటి రోజునా శివ శంకర్ మాస్టర్ కన్ను మూగగా.. కొద్ది నిమిషాల ముందే సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. గత నెల రోజులుగా న్యూమోనియా తో ఆయన హాస్పిటల్ కి చేరగా.. ఈరోజు తుది శ్వాస విడవడం కూడా జరిగింది. ప్రస్తుతం సీతారామ శాస్త్రి వయసు 66 సంవత్సరాలు.


దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే కొద్ది రోజుల నుండి ఈయన ఆరోగ్యం బాగుందని..ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని.. వైద్యులు చెబుతూ ఉండగా.. కానీ ఈ రోజున  సీతారామ శాస్త్రి ఆరోగ్యం చాలా విషయంగా ఉంది అని తమ కుటుంబ సభ్యులు తెలుపడం జరిగింది. అలా తెలిపిన కొద్దిసేపటికి ఆయన మరణించడం జరిగింది. తన పాటలతో, ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈయన ఇలా ఒక్కసారిగా మరణించాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ఇండస్ట్రీలోని ఉండే నటీనటులు.

ఇక సీతారామశాస్త్రి 1955 తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఈయన సిని విషయానికి వస్తే.. బాలకృష్ణ తో జనని జన్మభూమి అనే మూవీ లో గేయ రచయితగా తన అడుగులు వేశారు. కానీ మొదటిసారే విఫలమయ్యారు. ఇక ఆ తరువాత సిరివెన్నెల అలా అని మూవీ లో పాటలు రాయడం వల్ల ఈయనకి బాగా కలిసొచ్చింది. ఇక ఈ పాటలతో ఈయనకు ఎనలేని కీర్తి రావడం గమనార్హం.

దీంతో ఈయన పేరు కాస్త ప్రజలలో బాగా నాటుకుపోయింది. ఈయన కెరియర్లో ఎన్నో వేల పాటలను రాయడం జరిగింది. కొన్ని మంచి మంచి సినిమాలు ఆయన పాటల వల్లే హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈయన గాయం సినిమాలో  ఒక నటుడిగా కూడా మారారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: