అదే సమయంలో అటు బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ గా ఎవరు నిలవ బోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం స్పందిస్తూ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బిగ్బాస్ నాలుగవ సీజన్లో ప్రేక్షకులందరినీ అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సోహెల్ ఇటీవలే బిగ్బాస్ 5 సీజన్ లో విన్నర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అయితే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నదానిపై తన అభిప్రాయాన్ని చెప్పిన సోహెల్ మళ్లీ ఇతర కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫాన్స్ నుంచి విమర్శలు వస్తాయి అని భావించి వెంటనే తన పోస్టుని డిలీట్ చేశాడు. ప్రస్తుతం బిగ్బాస్ 5 సీజన్ లో సన్నిని చూసి తనను తాను చూసుకుంటూన్నట్లుగా ఉంది అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. 5వ సీజన్ కి సన్నీ విన్నర్ అవుతాడు ఒక పోస్టు పెట్టాడు. సన్నీతో పాటు కాజల్ మానస్ లు కూడా ఫినాలేలో ఉంటారని చెప్పుకొచ్చాడు. కానీ అంతలో ఏమనుకున్నాడో ఏమో మిగతా కంటెస్టెంట్స్ నుంచి విమర్శలు ఎందుకు అని భావించి వెంటనే పోస్ట్ డిలీట్ చేశాడు. ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్న ఈ సమయంలో విమర్శలు ఎందుకు అని భావించి ఇక పోస్ట్ డిలీట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి