టాలీవుడ్ స్టార్ హీరో కావడం, అందులోనూ బన్నీ తొలి పాన్ ఇండియా మూవీ, సరికొత్త కథనం, పాటలు ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పేలా చేశాయి. అయితే ఆ అంచనాలను పుష్ప మూవీ అందుకుంటుందా, అంచనాలకు మించి ఉండబోతుందా అన్నది ఇంకో వారంలో తెలియనుంది. ఇపుడు టాలీవుడ్ హోం టౌన్ లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. మరి ఈ సినిమా బన్నీ కెరియర్ లో ఒక సంచలనం కానుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రమంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకోవాలని ఆశిద్దాం.
అయితే ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓమిక్రాన్ భయపెడుతున్న కారణంగా సినిమా బాగున్నా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయన్నది అనుమానంగా మారింది. మొదటి నుండి ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. పైగా వాస్తవ కథతో మిళితమై ఉన్నందున ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టించనుందో తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి