ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఆడియో విడుదల అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో సంచలన రికార్డులను నమోదు చేస్తుంది. సుకుమార్ ఎన్నో రోజులుగా ఎంతో తపన పడి మరి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండగా ఆమె శ్రీవల్లి గా ప్రేక్షకులను ఎంతగానో అలరించబోతోంది అని చెబుతుంది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కాజల్ విలన్ గా నటిస్తుండగా సునీల్ మరో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అనసూయ ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగుతుండగా ఈ చిత్రం యొక్క రెండవ భాగాన్ని వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఆర్య-2 చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా ఇప్పుడు రాబోతున్న ఈ పుష్ప చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మంగళం శ్రీను పాత్ర లో సునీల్ మరో అద్భుతమైన పాత్ర లో కనిపించాబోతున్నాడు. పలు రకాల పాత్రలు పోస్తూ ఆకట్టుకుంటున్న సునీల్ ఈ పాత్ర తో ఎలా ఆకట్టు కుంటాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి