టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై అక్కినేని వారి వారసురాలు సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం 'అనుభవించు రాజా'.వరుస ప్లాపులు తరువాత హీరో రాజ్ తరుణ్ ఎన్నో ఆశలతో ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో చాలా జాగ్రత్తలు తీసుకొని తన మార్క్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఈ సినిమాని తీసాడు. అలాగే ఈ సినిమా హిట్టు కోసం జనాలలోకి వెళ్ళడానికి చాలా ప్రమోషన్స్ కూడా చేశాడు.కాని ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ గత సినిమాల లాగే బాగా నిరాశపరచడం జరిగింది.ఇక పోయిన నెల అనగా నవంబర్ 26 వ తేదీన విడుదలైన ఈ సినిమాకి మొదట్లో రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ వల్ల పర్వాలేదనిపించే టాక్ వచ్చింది.దాంతో వీకెండ్ దాకా కూడా కలెక్షన్లు ఓ మోస్తారుగా పర్వాలేదు అనిపించింది. కానీ వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మాత్రం పూర్తిగా డౌన్ అయిపోవడం జరిగింది.

ఇక అంతేగాక నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను ల 'అఖండ' లాంటి సినిమా రావడం అది బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ సినిమాని పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు.దాంతో హీరో రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద పరాజయం పాలవ్వడం జరిగింది.ఇక 'అనుభవించు రాజా' పూర్తి వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.42 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేయడం అనేది జరిగింది.దాంతో బయ్యర్లకి ఈ సినిమా బిజినెస్ పై రూ.1.48 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో మరో ప్లాప్ గా మిగిలినప్పటికీ..ఓపెనింగ్స్ విషయంలో మాత్రం అతనికి కొంచెం ఊరటనిచ్చింది అని చెప్పాలి. ఓటిటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కాని వాటన్నిటిని కాదని చాలా రోజులు వెయిట్ చేసి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: