నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో సక్సెస్ అయినట్టు తెలిసిందే. మాములుగా బయట చాలా తక్కువగా మాట్లాడే బాలయ్య బాబు టాక్ షో హోస్ట్ చేయడం అనగానే ఫ్యాస్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది. ఇప్పటికే నాలుగు సక్సెస్ ఫుల్ ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఐదవ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా మంచి మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ రాగా.. సెకండ్ ఎపిసోడ్ నాచురల్ స్టార్ నాని వచ్చాడు.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ థర్డ్ ఎపిసోడ్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అనీల్ రావిపుడి కలిసి వచ్చారు. ఇక ఈ షోలో నాల్గవ ఎపిసోడ్ గా సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చారు. మహేష్ ఎపిసోడ్ ఇంకా స్ట్రీమింగ్ అవలేదు. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఐదవ ఎపిసోడ్ గా దర్శక ధీరుడు రాజమౌళిని గెస్ట్ గా పిలిచినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా.. అన్ స్టాపబుల్ షోలో జక్కన్న అలరించనున్నారు. రాజమౌళితో బాలకృష్ణ ఇంటర్వ్యూ ఎలా సాగింది. జక్కన్నని బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలతో ఆడుకున్నాడు అన్నది షో చూస్తేనే తెలుస్తుంది.

రాజమౌళితో పాటుగా కీరవాణి కూడా ఈ షోలో పాటిస్పేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి, బాలకృష్ణ ఇంటర్వ్యూ ఫోటోస్ నెట్ లో వైరల్ గా మారాయి. తప్పకుండా ఈ ఎపిసోడ్ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు. బాలయ్య అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అఖండ హిట్ తో ఉత్సాహంలో ఉన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోని అదే జోరుతో చేస్తున్నాడని తెలుస్తుంది. బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: