తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్..ఈ షో ఇప్పటికే ఐదో సీజన్ ముగింపు దశలో ఉంది. ఇందులో పాల్గొన్న వారంతా కూడా సుపరిచితులే.. అందులో యూట్యూబర్ గా మంచి పేరు తెచుకున్న షణ్ముఖ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అక్కడ ఇతను చేసే మ్యాజిక్ జనాలకు విపరీతంగా నచ్చుతుంది. అలా అతనికి క్రేజ్ పెరిగిపోతుంది.. క్రేజ్ వల్లే బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి సెలెక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్‌ 5లో షణ్ముఖ్‌ ఒకడు.


మొదట్లో మనకెందుకులే అని సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ ఇప్పుడు అన్నీ టాస్క్ లలో చురుగ్గా ఉంటున్నారని తెలుసు. సేఫ్ జోన్ లో తెలివిగా గేమ్ లను ఆడుతూ వస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్స్‌ వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టాప్ లిస్ట్ లోకి వచ్చేశాడు.అతను రెండో స్థానం లో ఉంటాడని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.. ఎమౌతుందో చివరి వరకూ చూస్తె కానీ తెలియదు.


ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ నుంచి బయటకు రాకముందే బంఫర్ ఆఫర్ ను కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.. హీరోగా ఓ సినిమా రాబోతుందట. యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. షణ్ముఖ్‌ చాలా రోజులుగా ఇండస్ట్రీలో అవకాశం కోసం చూస్తున్నాడు. గతంలో చాలా ఆవకాశాలు వచ్చాయి.అవి చిన్న పాత్రలు కావడంతో వద్దనుకున్నా డు.. బిగ్ బాస్ పుణ్యమా అంటూ షో పూర్తీ అవ్వక ముందే అబ్బాయికి ఫాలొయింగ్ పెరిగింది. దర్శక, నిర్మాతలు సినిమాలు చేయడానికి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ల్లో ఎంత నిజం ఉందో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నెటిజన్లు మాత్రం ఎవరిష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సీజన్ విన్నర్ సన్నీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. ఎవరూ వస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: