దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్,  ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రలో నటించారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డి వి వి.దానయ్య నిర్మించారు, ఈ సినిమాలు రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు, ఇప్పటికే షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను  వేగ వంతం చేసింది, అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితమే ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం విడుదల చేసింది. మూడు నిమిషాల నిడివి కంటే ఎక్కువ ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరి మధ్య సినిమాలో అదిరిపోయే రేంజ్ లో ఫ్రెండ్షిప్ ఉండబోతుంది అని, అలాగే యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి అని, కథ ఎంత బలంగా ఉండబోతుందో అనే విషయాలను ఈ మూడు నిమిషాల ట్రైలర్ ద్వారానే రాజమౌళి ప్రేక్షకులకు తెలియజేశాడు.  ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళ్ , మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది, అన్ని భాషలలో కలిపి ఈ ట్రైలర్ ప్రస్తుతం 100 మిలియన్ మార్క్ వ్యూస్ ని టచ్ చేసింది, ఇలా ఈ సినిమా ట్రైలర్ కూడా జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: