సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ వండర్ఫుల్ సినిమాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మరోసారి మూడో సినిమా తెరకెక్కనుంది.అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందో ఎప్పుడు రిలీజవుతుందో అని మహేష్ ఫ్యాన్స్ కు అసలు అర్థం కావడం లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దుబాయ్ లో ఉండగా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం తెలుస్తుంది. మహేష్ బాబు హాజరు కాకపోయినా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జరుగుతోందని జనవరి మంత్ ఫస్ట్ వీక్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే మహేష్ సినిమా కోసం మంచి బౌండ్ స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేశారని సమాచారం తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో ఆగష్టు నెల నాటికి కేవలం ఆరు నెలల్లో పూర్తి కానుందని వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం తెలుస్తుంది.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారని సమాచారం తెలుస్తోంది. ఇక జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను చాలా వేగంగానే పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్జరీ కారణంగా దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ గురించి చాలా సంవత్సరాల నుంచి వార్తలు వస్తుండగా ఎట్టకేలకు ఈ సినిమా మొదలుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: