మన చిత్తూరు ఎర్ర చందనం దుంగలకూ
ఏమయినా బంధం ఉండి ఉండాలి
బంగారంను, బంగారంను ఇంటికి తెప్పించే
అడవులను మనం ఎలా చూడాలి
ఏ విధంగా చూసినా శక్తి మేరకు అడవి దాటిపోయిన
దుంగలను శక్తి మేరకు దేశం దాటిపోయిన దొంగలను
మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏం చేసినా సినిమా మాత్రం
వీటిని గ్లోరిఫై చేస్తుంది.. ఈ సినిమా కూడా అలానే చేసింది
కథ పరంగా ఓ అనైతికం .. ఒక స్మగ్లర్ జీవితం ఆయన జీవితంలో ప్రేమ
ఇవన్నీ కలిస్తే సినిమా పుష్ప ద రైజ్
సినిమాను కేజీఎఫ్ తో పోల్చడంలో తప్పు ఉందో లేదో తెలియదు కానీ ఈ సినిమాకు వాస్తవిక దృక్పథం ఎంతున్నది ఏ మేరకు అది ప్రభావితం చేసింది అన్నదే ముఖ్యం. ఈ సినిమా ఓ దర్శకుడి జీవితాన్ని ఓ నటుడి జీవితాన్ని ఈ ఇద్దరూ కలిసి అనుకున్న మరియు ఎంచుకున్న లక్ష్యాలను నెరవేరిస్తే చాలు. ఆ విధంగా పుష్ప ద రైజ్ తొలి నుంచి తుది వరకూ ఉంటే మేలు.. ఇదీ ఇవాళ అభిమాని కోరుకుంటున్న తీరు.
కవిత్వం అంటే ఇష్టమున్న దర్శకుడు సుక్కూ.. కవిత్వంతో పాటు ప్రేమ తత్వం నింపే కవిత్వంలో తనని తాను చూసుకోవడం ఇంకా ఇష్టం.. ఈ ఇష్టాలను రెట్టింపు చేసుకుంటూ మొదట్నుంచి విజువల్ పోయెట్రీ తీయాలన్న ఆలోచనలో అతడు. సినిమాను ఆయన అలానే చూస్తారు. మనం ఆలోచించే వేగానికి ఆయన ఆలోచించే వేగానికి ఉండే తేడా ఏంటన్నది ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది అనేందుకు ఉదాహరణలు ఎన్నో! ఈ సారి కూడా సుక్కూ తెలివికి సంకల్పానికి ప్రాణం పెట్టారు. తెలివితో కథను ఆ కథను నడిపించడంలో సంకల్పాన్ని తన వంతు సాయంగా తీసుకుని వాడుకున్నారు. దటీజ్ సుక్కూ. సినిమా ఎలా ఉన్నా ఎంతటి స్థాయిలో ఉన్నా ఈ బృందం చేసిన కష్టం అసామాన్యం అనితర సాధ్యం కూడా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి