కన్నడ నుండి వచ్చిన రష్మిక తెలుగులో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్స్ లో టాప్ లో ఉన్నది ఎవరు అంటే ఖచ్చితంగా అది రష్మిక అనే చెబుతారు. అందం, అభినయం రెండు కలిపి అమ్మడు వరుస స్టార్ సినిమాలతో సత్తా చాటుతుంది. చేస్తున్న సినిమాలు కూడా హిట్లు పడటంతో ఆమెకి మరింత క్రేజ్ వస్తుంది. లేటెస్ట్ గా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మరోసారి తన సత్తా చాటింది. తనకు ఇచ్చిన పాత్ర ఎలాంటిదైనా దానికి 100 పర్సెంట్ ఇచ్చే హీరోయిన్స్ లో రష్మిక ఒకరు.

అందుకే సినిమా సినిమాకు ఆమె మరింత మంది ప్రేక్షకులకు దగ్గర అవుతుంది. పుష్ప సినిమా తర్వాత మరో రెండు స్టార్ సినిమాలు ఉన్నాయని టాక్. ఇదిలాఉంటే రష్మికతో రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ఓ దర్శకుడు ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. అంతకుముందు హీరోగా చేసిన అతను హీరోగా వర్క్ అవుట్ కాదని చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఇక ఓ మంచి సినిమాతో డైరక్టర్ గా మారాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సెకండ్ సినిమా టాలీవుడ్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా ఆ అవకాశాన్ని సరిగా వాడుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు అతను థర్డ్ మూవీగా రష్మికతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే రష్మికకు కథ వినిపించడం ఆమె ఓకే చెప్పడం అంతా జరిగాయట. లేడీ ఓరిఎంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో రష్మిక పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. తనకు ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర ఇచ్చినా తన అభినయంతో మెప్పించే రష్మిక ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలియనున్నాయి. ఛలో నుండి పుష్ప వరకు రష్మిక తన టాలెంట్ తో దూసుకెళ్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: