దాదాపు వంద రోజులుకు పైగానే బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షించిన బిగ్బాస్ కార్యక్రమము ఇక ఇటీవలే గ్రాండ్ ఫినాలే తో ఘనంగా ముగిసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ విన్నర్ గా సన్నీ నిలిచాడు. ముందుగా అనుకున్నట్లు గానే అటు ప్రేక్షకుల ఓట్లను గెలుచుకున్న సన్నీ టాప్ లో  నిలవడంతో చివరికి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయిన బయటికి వచ్చిన వారి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు టాప్ ఫైవ్ లో కొనసాగిన కంటెస్టెంట్ లు గ్రాండ్ ఫినాలే లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు.


 ఈ క్రమంలోనే  బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో లేడీ పటాకా గా పేరు తెచ్చుకుంది సిరి. అబ్బాయిలతో పోటీపడుతూ గేమ్స్ ఆడుతూ ఎన్నో విజయాలను కూడా అందుకుంది. సిరి కాన్ఫిడెన్స్ ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షించింది. అయితే షణ్ముక్ తో ఫ్రెండ్షిప్ వళ్ళ అక్కడక్కడా కొంతమందికి చిరాకు తెప్పించింది. అయినప్పటికీ తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిరి తెలుగు బిగ్బాస్ చరిత్రలో టాప్ ఫైవ్ లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా చరిత్ర సృష్టించింది.


 ఇక గ్రాండ్ ఫినాలే లో కనీసం మూడవ స్థానంలో ఆయన నిలుస్తుంది అని అనుకున్నప్పటికీ చివరికి స్థానంతో సరిపెట్టుకుంది. ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే సిరి రెమ్యూనరేషన్ ఎంత తీసుకొని ఉంటుంది అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సీరియల్ లోనూ వెబ్ సిరీస్ లను నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి బిగ్ బాస్ హౌస్ లో వారానికి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక 15 వారాలకు గానీ బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఏకంగా 25 లక్షల వరకు పారితోషికం అందుకొని ఉంటుంది సిరి.

మరింత సమాచారం తెలుసుకోండి: