పెళ్లైన తర్వాత కొంత మంది హీరోయిన్లు తమ స్పీడ్ తగ్గిస్తారు.వారికి కొన్ని కట్టుబాట్లు వున్నాయి అంటూ కాబట్టి వాటిని బ్రేక్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. సెలక్టివ్ గా స్ర్కిప్ట్ లను సెలెక్ట్ చేసుకుని కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం తమ పనిని ఓ వృత్తిగానే భావించి పాత్రలకు న్యాయం చేయాలంటూ ఏమాత్రం వెనక్కి తగ్గరు. పర్సనల్ లైఫ్ వేరు..ప్రొఫెషనల్ లైఫ్ వేరు అంటూ వారి రెంటి లైఫ్ లను డివైడ్ చేసి కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాళ్లలో ఈనాటి జనరేషన్ చూసుకుంటే కరీనా కపూర్..ప్రియాంకచోప్రా.. లారాదత్తా ఇంకా రాధికా ఆప్టే అలాగే సమంత లాంటి వారు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫ్ ది స్ర్కీన్ ఇంకా ఆన్ ది స్ర్కీన్ ఎలా చెలరేగిందో చెప్పాల్సిన పనిలేదు. `ఫ్యామిలీ మ్యాన్-2` వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి హాట్ టాపిక్ గామారింది. సమంత ఇలా నటించడంపై  అక్కినేని అభిమానుల భగ్గుమన్నారు. అయినా సమంత అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఈ కపుల్ విడాకుల తో వేరైన సంగతి తెలిసిందే. ఇక రాధిక ఆప్టే కూడా ఆమె సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకుంది. ఆమె నటించే ఇంటిమేట్ సీన్స్ గురించి  అయితే చెప్పాల్సిన పనిలేదు. వెబ్ సిరీస్ చేస్తూ నెట్ ప్లిక్స్ కే పెద్ద హాట్ బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది. అంతగా ఆ వేదికపై ఆమె బాగా ఫేమస్ అయింది.ఇక అంతేగాక మంచి గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ఏకంగా హాలీవుడ్ కి వెళ్లి మరీ రొమాంటిక్ సీన్స్ లో చెలరేగిపోతుంది. వృత్తి విషయంలో ఏమాత్రం రాజీకి రాకుండా విమర్శలు వెల్లు వెత్తినా కాని వాటిని ఏమాత్రం అసలు ఆమె పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది. ఇటీవలే  `ది వాంటెడ్ టైగర్` లో బోల్డ్ సీన్స్ లో ఆమె మునిగి  తేలింది.అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిమేట్ సీన్స్ కి ఏమాత్రం బ్రేకులు వేయలేదు. `కీ అండ్ కా`అనే సినిమాలో అర్జున్ కపూర్ తో ఓ రేంజ్ లో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అలాగే మహేష్ భూపతిని పెళ్లాడిన తర్వాత లారా దత్తా రొమాన్స్ లో  ఏమాత్రం స్పీడ్ తగ్గించలేదు. హిక్కప్స్ అండ్ హుకప్స్ లో  బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: