ఈ క్రమంలో రెజినా ఆచర్య సినిమాలో సానా కష్టం సాంగ్ లో నర్తించింది. మెగాస్టార్ సరసన కాలు కదిపే ఛాన్స్ అంటే నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రెజినా ఇప్పటికి సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నా స్పెషల్ సాంగ్స్ కోసం రెడీ అంటుంది. ఓ విధంగా చెప్పాలంటే రెజినా కెరియర్ కు మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఈ సాంగ్ చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.
ఆచార్యలో సానా కష్టం సాంగ్ లో రెజినా మ్యాక్సిమం తన అందాలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. స్పీషల్ సాంగ్ అంటేనే హాట్ గా కనిపించడం. ఇక మీదట ఎలాగైనా ఆడియెన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో రెజినా అదరగొట్టేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే రెజినాకి ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటుగా శాకిని డాకిని అనే సినిమా చేస్తున్న రెజినాకి 2022 కలిసి వస్తుందేమో చూడాలి. ఆచార్య సినిమాలో పూజా హెగ్దే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి