సినిమా పరిశ్రమలో హిట్ ఉంటేనే ఎవరికైనా స్టార్ డమ్ ఉంటుంది. ఒక్క సినిమా పరిశ్రమ అనే కాదు ఎవరికైనా విజయం ఉంటేనే వారి జీవితంలో తగిన విలువ అనేది ఉంటుంది. ఇదిలాఉంటే ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలు గా ఉన్న చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇప్పుడు తమ సినిమాలతో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమా తో హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తో మళ్లీ ఓసారి తన స్టామినాను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైరా సినిమా తో అదరగొట్టిన చిరంజీవి ప్రేక్షకులకు వెండితెరపై కనిపించి రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతున్న చిరంజీవి ఆచార్య సినిమాతో హిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఇక అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమా తో వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా ఈ సినిమాతో హిట్ కొట్టి తన ఫ్లాపుల పరంపరకు తెర దించాల్సిన టైం వచ్చింది. మరి అక్కినేని అభిమానులు కోరుకుంటున్న విజయం దక్కుతుందో చూడాలి. ఇక విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు ఓ టీ టీ లోనే సినిమాలను విడుదల చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. థియేటర్ల లో విజయం అందుకొని ఆయన చాలా రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఎఫ్ 3 సినిమాతో ఆయన హిట్ కొట్టి మళ్ళీ తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఈ సీనియర్ హీరోలు నిరుపించుకోవాల్సిన ఈ సమయంలో ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: