ఇక ఇదిలాఉంటే త్వరలో లైగర్ టీం కూడా అన్ స్టాపబుల్ షోకి వస్తారని టాక్. ఈమధ్యనే ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకి వచ్చి లైగర్ టెమెం సందడి చేయబోతుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత ఆర్.ఆర్.ఆర్ టీం ని కూడా అన్ స్టాపబుల్ షోకి పిలుస్తారని టాక్. ఆల్రెడీ రాజమౌళి ఈ షోకి వచ్చాడు. ఇక రావాల్సింది ఆ ఇద్దరి హీరోలే. బాబాయ్ షోకి అబ్బాయ్ గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుంది. షో ఓ రేంజ్ లో ఉంటుంది.
ప్రస్తుతం అలాంటి ఓ మెగా ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. బాలయ్య, ఎన్.టి.ఆర్ ఒకే స్టేజ్ మీద కనిపిస్తేనే సూపర్ క్రేజ్. అలాంటిది ఓ టాక్ షోలో.. ఒకరి గురించి ఒకరు మాట్లాడితే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ టీం తో బాలయ్య అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందని టాక్. మరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూడాలి. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడగా చిత్రయూనిట్ నిరాశగా ఉన్నారు. అయితే సినిమా ఈ పరిస్థితుల్లో రిలీజ్ చేసి నష్టపోవడం కన్నా రిలీజ్ వాయిదా వేయడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి