మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం తుది మెరుపులు దిద్దుకుంటోంది. 2022 లో రిలీజ్ కోసం శరవేగంగా ముస్తాబవుతోంది. వరుస సూపర్ హిట్స్ ను అందిస్తూ అపజయమెరుగని దర్శకునిగా దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ అత్యంత వ్యూస్, లైక్స్  సృష్టించాయి. చిరంజీవితో కలిసి తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడం మరో సెన్సేషన్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్, సంగీత, అందాలభామ పూజా హెగ్డే ఇతర తారాగణంగా రూపొందింది ఆచార్య చిత్రం. ఇప్పటికే రిలీజ్ రెండు లిరికల్ సాంగ్స్ మాంచి ట్రెండ్ లో కొనసాగుతున్నాయి.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మూడవ లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చానా కష్టం వచ్చిందే మందాకిని అనే పల్లవి తో సాగుతుంది ఈ పాట. స్పెషల్ ఐటం సాంగ్ గా ఈ పాటను రూపొందించారు. గేయ రచయిత భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు. మణిశర్మ అందించిన ట్యూన్స్ ఎంతో క్లాసీగా ఉన్నాయి. ఈ పాటలో చిరంజీవితో కలిసి రెజీనా కసాండ్రా వేసిన స్టెప్పులు యువతను ఫిదా చేసేలా ఉన్నాయి. ఈ పాటలోని సాహిత్యానికి అభ్యంతరం చెబుతూ ఇటీవల పోలీసు కేసు నమోదయ్యింది.

ఏడేడో నిమరచ్చని కుర్రాళ్ళే ఆర్ఎంపీలు అవుతున్నారే అనే పదాలకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు కొందరు ఆర్ఎంపీ డాక్టర్స్. ఇది తమకు అవమానమని, వైద్య వృత్తిని కించపరిచేలా ఉందని  వాళ్లు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం సెన్సేషన్ గా మారింది. అమ్మాయిలను తాకటం కోసమే తాము వైద్యం చేస్తున్నామని రాసిన రచయిత భాస్కరభట్ల, పాటను చిత్రీకరించిన దర్శకుడు కొరటాల శివపై ఫిర్యాదు చేశారు ఆర్ఎంపీ డాక్టర్స్. దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: