తన యాక్టింగ్‌ తో , డ్యాన్స్ తో చాలా మంది ఫ్యాన్ ఫాలొయింగ్ ఉన్న వ్యక్తి  అల్లు అర్జున్.. సరైనోడు సినిమా తో భారీ ప్లాప్ ను అందుకున్న బన్నీ అల వైకుంఠపురం లో సినిమా తో టాలీవుడ్‌కు అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌ను అందించారు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో హిట్ సినిమాను సినీ ప్రేమికులకు అందించారు.పాన్ ఇండియా చిత్రం పుష్ప. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే పాత్రలో నటించారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపొతుంది. 



తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌లో ఏ దర్శక నిర్మాతల తో పనిచేయాలని ఉందని బన్నీని ఈ ఇంటర్వ్యూ లో అడిగితే.. బాలీవుడ్‌లో చాలా మంచి దర్శకులున్నారు. మంచి స్క్రిఫ్ట్‌ తో ఏ దర్శకుడు వచ్చినా తప్పకుండా నటిస్తాను. మంచి ప్రాజెక్టు లో భాగం కావాలని నాకు ఉంది.. గతం లో కొందరు అన్నారు. కానీ పెద్దగా పట్టించుకోలేదు.. కాగా హింది లో ఎంట్రీ ఏ ప్రాజెక్టులోనైనా భాగం అయితే తప్పకుండా ప్రకటిస్తాను. కానీ, ఇప్పటి వరకు ఏది కూడా ఫైనలైజ్ కాలేదు. 



ఇది ఇలా ఉండగా.. ఎ హీరోయిన్ తో నటిస్తారు. అనే ప్రశ్న బన్నికి ఎదురైంది. స్క్రిఫ్ట్ డిమాండ్ మేరకు ఎవరయితే నటిస్తారో వారితో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వ్యక్తి గతంగా ఇష్టమైనవారు ఎవరు లేరు.. అంటూ బన్నీ సమాధానం చెప్పుకొచ్చారు. కాగా, సినిమా హిట్ అవ్వడం తో 2వ భాగమైన పుష్ప: ది రూల్  పై మంచి అంచనాలున్నాయని వివరించారు. మరో 2 నెలల్లో పుష్ప 2 షూటింగ్‌ ను ప్రారంభిస్తామన్నారు. షూటింగ్ మొదలవ్వడానికి నెల రోజుల కు పైగా సమయం ఉండటంతో అందరూ ఎంజాయ్ చెస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: