తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా కొనసాగిన నాగచైతన్య-సమంత ఇటీవల విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరు విడిపోతున్నారని తెలిసి ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. విడిపోవడానికి అసలు రీజన్ కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. విడాకుల అనంతరం వీరిద్దరూ ఎవరి లైఫ్ వాళ్లు సంతోషంగా జీవిస్తున్నారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సమంత.. తన కెరియర్‌లో మరింత స్పీడ్ పెంచింది. ఈ సాంగ్ మంచి హిట్ అందుకోవడంతో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.


టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు సమంత ప్రయత్నాలు మొదలుపెట్టింది. పుష్ప హిట్‌తో సమంతకు లైన్ క్లియర్ అయింది. విడాకులప్పుడు దాదాపు 3 నెలలపాటు ఈ జంట ఎందుకు విడిపోతున్నారనే విషయం ట్రెండింగ్‌గా నిలిచింది. చాలా మంది విడిపోకండి అంటూ రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ విడాకుల మ్యాటర్‌లో ఎవరూ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి నాలుగేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. వీరిద్దరు విడిపోవడంపై నాగార్జున కూడా స్పందించలేదు. విడాకుల అనంతరం సమంత అన్ని సినిమాలకు ఓకే చెబుతూ ఫుల్ బిజీ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తాజాగా ప్రెగ్నెన్సీ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారడంతో మరోసారి సమంత సెన్సేషన్‌గా మారింది.


ఇంతకీ ఏం అని ఉంటుందని భావిస్తున్నారా..? టాలీవుడ్ అందాలభామ కాజల్ తల్లి కాబోతోంది. ఈ సంగతి అధికారికంగా వెల్లడించారు. కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఆమె బిడ్డను జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో సమంత కూడా కాజల్‌కు విషెస్ చెప్పింది. ‘చాలా సంతోషంగా ఉంది.. కాజల్ అమ్మ కాబోతుంది. క్యూట్‌గా మెరిసి పోతున్నావ్ కాజల్’ అని చెప్పుకొచ్చింది. దీనికి కాజల్ రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ మై డియర్ సామ్’ అని పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: