పండగ రోజున ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి కుటుంబ సభ్యులతో పండగను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు, కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది, పండగ రోజు కూడా ఏ మాత్రం విశ్రాంతి లేకుండా తన పనులతో బిజీగా సమయాన్ని గడుపుతోంది. సమంత కెరియర్ మంచి  పిక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే, అయితే గత కొంత కాలం క్రితమే వీరిద్దరూ విడాకులు అయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే, ఇలా సమంత, నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత తన సినిమాల స్పీడ్ ను విపరీతంగా పెంచేసింది. ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేస్తున్న సమంత మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది.

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత పండగ రోజును కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన పనుల్లో ఫుల్ బిజీగా ఉంది, ఉదయాన్నే వర్కౌట్ లతో సమంత మునిగిపోయింది, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటిషన్‌లకు ప్రిపేర్ అవుతున్నట్టుగా వరుసగా వెయిట్‌లను పెంచుకుంటూ సమంత లిఫ్ట్ చేసింది.  75, 78, 80 కిలోలు అంటూ వెయిట్ లిఫ్ట్ చేసుకుంటూ సమంత వెళ్ళింది. దీనిని బట్టి చూస్తే సమంత సంక్రాంతి సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది, ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం  యశోద సినిమాల్లో నటిస్తోంది, శ్రీదేవీ సినిమా బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించడానికి సమంత రెడీ గా ఉంది, వీటితో పాటు సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉండటం వల్లే సంక్రాంతి పండుగను సమంత పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: