కరోనా నేపథ్యంలో  ఇప్పటికే ఎంతోమంది  స్టార్ హీరోల సినిమాలు  వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన  ఆచార్య మూవీ  అన్ని పూర్తి చేసుకొని ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కానీ కరోణ విజృంభణతో ఈ సినిమా రిలీజ్ తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు సినీ వర్గాలు. మరి అది ఎప్పుడు తెలుసుకుందామా..?
మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు ఆచార్య మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు.  విడుదల తేదీలు ప్రకటించిన చిత్ర యూనిట్. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ  తెలియజేసింది.


మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా  నటించగా.. రామ్ చరణ్,పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా కరోనా ఓమిక్రాన్ ప్రభావం, సినిమా పరిశ్రమ పై ప్రభావం చూపిస్తుంది. రోజు రోజుకి కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో RRR, రాధేశ్యాం సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే నిన్న ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందారు.

 ఇదిలా ఉంటే.. తాజాగా ఆచార్య కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన  సినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ పూజ హెగ్డే  కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయి ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: