టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరి హీరోల సినిమా కు కరోనా ప్రభావం భారీగా పడుతుంది. కొన్ని సినిమాలు ఈ కరోనా తో వేగలేక తమ సినిమాలను ఓ టీ టీ లో విడుదల చేసుకున్నాయి. తద్వారా వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు. పోనీ ధైర్యం చేసి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేద్దాము అని అనుకున్నా కూడా భారీ నష్టం ఎదురయ్యింది వారికి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో సదరు సినిమాలు బాగా ఉన్నాయని పేరు తెచ్చుకున్న కూడా నష్టాలను మాత్రం ఎదుర్కోక తప్పలేదు.

ఆ విధంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితులను ఎదుర్కొని సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో మరొకసారి కరోనా మూడవ వేవ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను దెబ్బ తీయడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే దీని కారణంగా మూడు చిత్రాలు తమ విడుదలలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఆ విధంగా మహేష్ బాబు సినిమాకు సైతం గట్టిగానే ఈ కరోనా సెగ తగులుతోంది.  ఆయన హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత ఆయన చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగుకు పలుమార్లు అంతరాయం కలిగించింది కరోనా. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకునే సమయానికి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. దాంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే అప్పుడు సంక్రాంతి కి పోస్ట్ పోన్ అయిన సదరు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు సినిమా మళ్లీ బలిపశువు అవుతుందనే టాక్ వినిపిస్తుంది. పెద్ద సినిమాల విడుదల ఉన్నాయని పోస్ట్పోన్ చేసుకుంటే మళ్లీ అదే సమయంలో ఆ సినిమాలు రావడం మహేష్ సినిమాకు భారీ గా నష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: