అనతికాలంలోనే టాలీవుడ్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఆయన చేస్తున్న సినిమాలు యూత్ లో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. పెళ్లి చూపులు నుండి రాబోతున్న లైగర్ వరకు విజయ్ దేవరకొండ కెరియర్ గ్రాఫ్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ అంటూ ఓ రేంజ్ సినిమా తో రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఇద్దరి క్రియేటివ్ మ్యాడ్ నెస్ ఈ లైగర్ లో చూపించనున్నారు.

ఇక లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ పారితోషికం అందుకున్నాడని తెలుస్తుంది. సినిమాను పాన్ ఇడియా రిలీజ్ చేస్తున్న కారణం గా లైగర్ కోసం విజయ్ 35 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెమ్యునరేషన్ చూస్తే విజయ్ రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది. ఈమధ్యనే లైగర్ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో కేక పెట్టించింది. సినిమా లో బాక్సర్ గా దేవరకొండ విజయ్ నటన పీక్స్ లో ఉంటుందని తెలుస్తుంది. లైగర్ ఫస్ట్ లుక్ టీజర్ దుమ్ముదులిపేయగా ఖచ్చితంగా లైగర్ తో విజయ్ దేవరకొండ పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని అర్ధమవుతుంది. 

పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా లో రౌడీ హీరో సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుంది. సినిమా లో అననయా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ యాక్టింగ్.. పూరీ టేకింగ్.. లైగర్ ని నెక్స్ట్ లెవల్ లో ఉంచెలా చేస్తున్నాయని అంటున్నారు. ఈ సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటిస్తున్నాడని తెలిసిందే. విజయ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా లైగర్ రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: