సోగ్గాడే కానీ అనుకున్నంత ఈజ్ లేదు ..సోగ్గాడే కానీ అనుకున్నంత హైప్ కూడా రాలేదు..బంగార్రాజుకు ఎక్క‌డో చిన్న ఇబ్బంది ఉండె..
అది దిద్దుకుంటే ..మ‌రిన్ని మంచి సినిమాలే వ‌స్తాయి..రావాలికూడా! ఓ విధంగా సంక్రాంతి రారాజు బంగార్రాజే కానీ!


బంగార్రాజు సినిమా విడుద‌ల‌యి మంచి టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్ల‌యితే కొన్నిచోట్ల లేవు అని తెలుస్తోంది.సినిమా ప‌రంగా క‌థ‌నం పెద్ద‌గా లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం అని విశ్లేష‌కులు అంటున్నారు.క‌థ‌నం ప‌రంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇంకాస్త మంచి ఫ‌లితం నాగ్ అందుకునేవాడ‌న్న వాద‌నొక‌టి వినిపిస్తోంది.స‌త్యానంద్ స్క్రీన్ ప్లే లో మెరుపులు లేక‌పోగా మ‌ర‌కలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పెద‌వి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.అయినా కూడా కొన్ని సంద‌ర్భాల్లో స‌న్నివేశాల్లో ఆశించిన ఫ‌లితం లేక‌పోయినా అక్కినేని కుటుంబ అభిమానులు మాత్రం బంగార్రాజును ముందుకు తీసుకువెళ్లేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారు.తాజాగా వీరి ప్ర‌య‌త్నానికి అక్కినేని చిన్నోడు (అఖిల్) కూడా తోడ‌య్యాడు.ఇవ‌న్నీ బాగున్నా ఇండ‌స్ట్రీ నుంచి బంగార్రాజుకు స‌పోర్ట్ క‌రువ‌యింది.


అక్కినేని చిన్నోడు అఖిల్ బంగార్రాజు సినిమా విష‌య‌మై ట్వీట్ చేశాడు. బంగార్రాజు సినిమా పై ప్ర‌శంస‌ల వాన కురిపించాడు. నాగార్జున‌కు కొడుకు అయినందుకు, చైకు త‌మ్ముడ్ని అయినందుకు గ‌ర్విస్తున్నాన‌ని అన్నాడు. అదేవిధంగా డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చినందుకు గాను ఇదే ట్వీట్ లో చిత్ర సార‌థికి కృత‌జ్ఞ‌త‌లు చెల్లించాడు.

ఇప్ప‌టిదాకా మూడ్రోజుల‌కు సంబంధించి యాభై మూడు కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌చ్చింద‌ని లెక్క తేల్చారు చిత్ర బృందం.ఓ విధంగా ఈ ప్యాండ‌మిక్ సిట్యువేష‌న్ లో ఇంత‌టి క‌లెక్ష‌న్ రావ‌డం మంచి ప‌రిణామమే! ఇంత‌కుమించి డ‌బ్బులు రావాల‌ని చిత్ర బృందం ఆశిస్తోంది.ఎందుకంటే సినిమాకు సంబంధించి టాక్ యావ‌రేజ్ గా ఉన్నా సంక్రాంతి సోగ్గాడు అయిన బంగార్రాజును దాటి మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో క‌లెక్ష‌న్ల ప‌రంగా అదిరిపోయే రిజ‌ల్ట్ రావాలి.కానీ చాలా చోట్ల క‌లెక్ష‌న్లు పెద్ద‌గా లేవ‌ని తేలిపోయింది. ఓవ‌ర్సీస్-లో డ‌ల్ గానే ఉంద‌ని తెలుస్తోంది.మరింత సమాచారం తెలుసుకోండి: