తెలుగులో నవ మన్మధుడు కింగ్ నాగర్జున తో సినిమాలు చేయాలంటే ఒకప్పుడు హీరోయిన్లు తెగ పోటీ పడే వాళ్ళు.. కానీ ఇప్పుడు నాగ్ సరసన  సినిమా అంటే హీరోయిన్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. నాగ్ కు ఇటీవల ఒక్క హిట్ సినిమా కూడా లేదు. మన్మథుడు 2 చేసాడు.. ఆ సినిమాలొ ఫుల్ రొమాన్స్ వున్నా కూడా పెద్దగా ఫలితం లేకపోయింది. సినిమా విడుదల అయిన మొదటి రోజే నెగిటివ్ టాక్ ను అందుకుంది. దాంతో సినిమా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది.


ఇటీవల బంగర్రాజు సినిమా లో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం నాగ్ ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చెస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటించాడు. కాగా ఇప్పుడు నాగ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఆ సినిమాకు హీరోయిన్ కష్టాలు తప్పలేదు. నాగ్ సరసన జోడి అంటే ఇప్పుడు ఎ హీరోయిన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.


ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు.సరికొత్త కథ తో థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది.పలు అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి కాజల్‌ తప్పుకుందని తెలుస్తోంది. అయితే అమలాపాల్ ను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలిసింది.ఇక సోనాల్‌ చౌహన్‌ పేరు ఉన్నట్లు సమాచారం. చిత్రంలో గూఢచారి పాత్రలో ఆఖరిగా సోనాల్‌ను తీసుకుంటారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆమెను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: