విజయ్ దేవరకొండ తన నటన గురించి పక్కన పెడితే.. తన యాటిట్యూడ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ బయట ఎలా ఉంటాడో సినిమాలలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటాడు.. చూసేవారికి కాస్త అమాయకంగా, ఆవేశంగా, తెగింపు మనిషిలా కనిపిస్తూ ఉంటాడు. ఈ పాత్రలు ఎక్కువగా విజయ్ దేవరకొండలో కనిపిస్తూ ఉంటాయి. ఇక అందుచేతనే ఈ పాత్రలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు.

హీరోలు తమ సినిమా విడుదల అవుతుందంటే కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు.. కానీ విజయ్ దేవరకొండ అ అలాంటి విషయాలను చాలా లైట్ గా తీసుకుంటాడట.. ఆ తర్వాత ఇంకో సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టి అటుగా వెళ్ళిపోతాడు.. హిట్ కొట్టాడనే విషయాన్ని ఎంత గట్టిగా చెప్తాడో.. ఫ్లాప్ పడిందనే విషయం కూడా అంతే గట్టిగా చెబుతూ ఉంటాడు విజయ్. అందువల్లనే ఆయన సీమటపాకాయ లాంటోడని బిగ్ బాస్ బ్యూటీ దివి తెలియజేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ కొన్ని ప్రశ్నలు అడగగా.. వాటికి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ఒక రేంజ్ లో ఉంటుంది అని తెలియజేసింది. అభిమానులు, ప్రేక్షకులు మాత్రం.."ఏం సినిమా రా.. ఏం చేశాడ్రా.. అని థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులు అంటుంటారు అని తెలియజేసింది.


ఆయన యాక్టింగ్ ఒక ఎత్తు అయితే.. ఆయన మాట్లాడే మాటలు.. ఆ స్లాంగ్, బిహేవియర్ ఇవన్నీ ఒక ఎత్తు.. ఇవన్నీ కలిపితే విజయ్ దేవరకొండ అని తెలియజేసింది. అంతేకాకుండా హీరోయిన్ కంగనా రనౌత్ ను చూస్తే ఈమెకు..AK -47 గన్ను గుర్తుకొస్తుందట.. ఆమె మాట్లాడే మాటలు కూడా ఆ గన్ లోని బుల్లెట్ లా ఉంటాయని తెలియజేసింది. ఇక అనుష్క అంటే తనకు అభిమానం అని తెలియజేసింది. ఇక ఈమెను చూస్తే ఒక ఫ్లవర్ లా అనిపిస్తుందని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: