తెలుగు ఇండస్ట్రీలో.. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగి నటించే మెప్పించే సత్తా ఉన్న యాక్టర్లలో జగపతి బాబు కూడా ఒకరు. అఖండ సినిమాతో తాజాగా సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. ఇక అంతే కాకుండా హీరో సినిమాలో కూడా ఒక మెయిన్ పాత్రలో పోషించాడు జగపతిబాబు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు.. చిత్ర పరిశ్రమలోని ఉండేటువంటి స్నేహితుల గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

ఎక్కడైనా సరే ఏదైనా రంగంలో మనం పని చేస్తున్నామంటే ఖచ్చితంగా స్నేహితులు ఉంటారు.. కానీ జగ్గు భాయ్ మాత్రం తనకి ఇండస్ట్రీలోనే స్నేహితులు లేరని తెలియజేశాడు. కేవలం హీరో అర్జున్ మాత్రమే తనకు జెన్యూన్ ఫ్రెండ్ అని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ హీరో తో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఆ ఫ్రెండ్షిప్ వల్లే తామిద్దరం ఒకరి మూవీలలో మరొకరు నటించమని చెప్పుకొచ్చారు జగపతిబాబు. అయితే అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఉంటాయని.. ఆ గొడవలను చూస్తే ఎవరైనా సరే మేమిద్దరం ఫ్రెండ్స్ లా కాకుండా శత్రువుల్లా కనిపిస్తామని తెలియజేశారు.తెలుగు చిత్రసీమలో మాత్రం తనకి ఎలాంటి ఫ్రెండ్స్ లేరని వెల్లడించారు. ఎవరి గురించైనా.. తను నా ఫ్రెండ్ అని చెప్పాలనుకుంటే.. వారు అప్పట్లో చేసిన ప్రవర్తనలు గుర్తుకు రావడంతో.. వారిని స్నేహితులుగా చూడాలనే భావన  ఉండదని తెలియజేశాడు.

సినిమా రంగంలో ఉండే కొంతమంది స్నేహితులు యూజ్ అండ్ త్రో గా ఉంటారని చెప్పుకొచ్చారు జగ్గు భాయ్.. ఈ హీరో చేసిన..ఈ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.. తాజాగా విలన్ లా ఎంట్రీ ఇచ్చి... రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం హీరో పాత్రలకు జగపతిబాబు దూరం కావడం జరిగింది. కాని విలన్ గా మాత్రం అందరిని మెప్పించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: