సినీ పరిశ్రమలో సినీ వారసుల హంగామా తెలిసిందే. బయట వాళ్లలాగా వాళ్లు అవకాశాల కోసం తిరగాల్సిన పని ఉండదు. డబ్యూ సినిమాకే భారీ హంగామా ఉంటుంది. వాళ్లకి నచ్చిన కథలనే మొదటి సినిమా చేసే స్వేచ్చ ఉంటుంది. ఈ క్రమంలో సినీ వారసులు తెరంగేట్రం ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెంచేలా చేస్తారు. ఈమధ్య కాలంలో స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ తో ఓ ట్రయల్ వేసిన రోషన్ హీరోగా ఈమధ్యనే పెళ్లిసందడి సినిమా చేశాడు. దసరా టైం లో రావడం వల్ల రివ్యూస్ తో సంబంధం లేకుండా సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది.

ఇక ఇదిలాఉంటే రోషన్ నెక్స్ట్ సినిమా బడా నిర్మాణ సంస్థలో వస్తుందని తెలుస్తుంది. వైజయంతి బ్యానర్ లో రోషన్ హీరోగ ఓ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా స్టోరీ కన్ ఫర్మ్ అవగా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. వైజయంతి బ్యానర్ నుండి వస్తున్న స్మాల్ బడ్జెట్ సినిమాగా రోషన్ సినిమా వస్తుంది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇక దీనితో పాటుగా రోషన్ మరో బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని టాక్.

సితార బ్యానర్ లో సినిమా అంటే ఆడియెన్స్ లో ఓ ఎక్సైట్ మెంట్ క్రియేట్ అవుతుంది. రోషన్ తో సితార సినిమా కూడా త్వరలోనే భారీ ఎనౌన్స్ మెంట్ చేస్తారని తెలుస్తుంది. వైజయంతి బ్యానర్, సితార ఎంటర్టైన్ మెంట్స్ రెండు టాలీఎవుడ్ లీడింగ్ ప్రొడక్షన్స్ కాగా రోషన్ ఈ రెండు సినిమాలతో తప్పకుండా భారీ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. శ్రీకాంత్ కూడా రోషన్ ని ఫుల్ టైం హీరోగా కెరియర్ గాడిలో పడేసేలా చేయాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: