సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది, అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే సర్కరు వారి పాట సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది, మరీ ముఖ్యంగా దుబాయి లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఉంటుందట, సినిమా సెకండాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాలు ఫ్యాన్స్ విజిల్స్ వేసే రేంజ్ లో ఉంటాయి అని తెలుస్తోంది.  ఇక సర్కారు వారి పాట సినిమాలో దుబాయ్ లో చేసింగ్ సీన్స్ యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం, ఈ సినిమాలో కీలకమైన ఎపిసోడ్ కావడంతో ఈ సన్నివేశాల కోసం నిర్మాతలు ఖర్చు చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు అని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాలో చేసే విన్యాసాలు ఈ యాక్షన్ సన్నివేశాలలో ఫ్యాన్స్ విజిల్స్ వేసే రేంజ్ లో ఉంటాయి అని ఒక టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: