ఉప్పెన సినిమాలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన కృతి శెట్టి తన రెండవ సినిమాలో గ్లామర్ డోస్ పెంచడం తో ప్రేక్షకులను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. లంగా ఓణీలతో చీరతో కనిపించి సంప్రదాయానికి పెట్టింది పేరుగా నిలిచిన ఈమె రెండవ సినిమాలో పొట్టి పొట్టి డ్రెస్సులు జీన్స్ పాయింట్ లు లో టైప్ డ్రెస్సులు వేసుకొని కుర్రకారుని బాగా అలరించింది. కానీ కుటుంబ ప్రేక్షకులను మాత్రం కొంత నిరాశ పరిచింది అని చెప్పవచ్చు. ఏదేమైనా హీరోయిన్ అంటే ఓ సినిమా  ప్రకారం సాంప్రదాయబద్ధంగా కనిపించాలి. ఇంకొక సినిమాల్లో గ్లామర్ గా కనిపించాలి. 

అయితే కృతి శెట్టి తన రెండవ సినిమాలో గ్లామర్ పంచడం వరకు ఓకే కానీ హీరోతో కలిసి లిప్ లాక్ కిస్ లు ఇవ్వటం అతనితో శృంగార సన్నివేశాల్లో పాల్గొనడం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలోని పాత్ర అలా డిమాండ్ చేసింది అనుకుంటే ఆ సినిమా ఈ ముద్దుగుమ్మ చేయొద్దు కానీ చేయడంపై వారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మూడవ సినిమాలో కూడా తనదైన గ్లామర్ ను ప్రేక్షకులకు పంచుతూ వారిని ఎంతగానో అలరించింది కృతి  శెట్టి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఓ నిర్ణయం తీసుకుందట. తాను నటించబోయే భవిష్యత్తు సినిమాలలో ముద్దు సన్నివేశాలు శృంగార సన్నివేశాలలో పాల్గొనవద్దని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గ్లామర్ షో చేయడం వరకు ఓకే కానీ ఈ విధంగా బోల్డ్ సన్నివేశాలలో నటించడం పట్ల తన అభిమానులు ఫీల్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో ఆమె ఈ  విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సుధీర్ బాబు సరసన ఈ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమాలో నటిస్తోంది. అంతే కాదు రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. మరి ఈమెను ముద్దు పెట్టుకునే అవకాశం హీరోలకు లేనట్లే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: