ఒక సినిమా తో సూపర్ హిట్ సాధించిన తర్వాత ఏ దర్శకుడైనా వెంటనే మళ్ళీ తొందరగా సినిమా అవకాశం రావాలి అప్పుడే సదరు దర్శకుడు కొట్టిన హిట్ కు వ్యాల్యూ ఉంటుంది అలా రాకపోతే నిజంగా ఆ దర్శకుడికి చాలా దురదృష్టం ఉన్నట్లు చెప్పాలి. అలా ఈ సంవత్సరం సిటీ మార్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడు సంపత్ నంది. ఆయన ఇప్పుడు అలాంటి పరిస్థితులలోనే ఉన్నాడు. సూపర్ హిట్ కొట్టినా కూడా ఆయన తన తదుపరి సినిమా ను ఇంకా అనౌన్సు చేయకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. 

చిన్న దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన సంపత్ మంచి కథలను రాసి దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఎంతో వైవిధ్యం చూపిస్తాడు. అందుకే ఆయన సినిమాలకు డిమాండ్ ఎక్కువ. ఒకటి రెండు సినిమాలు కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నా కూడా ఎక్కడో చిన్న లోపం వల్ల ప్రేక్షకులను నచ్చలేదు. దాంతో సిటిమార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి వారికి నచ్చేలా చిత్రీకరించాడు. అలా చాలా రోజుల తర్వాత ఆయన సూపర్ హిట్ సాధించి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తర్వాత పెద్ద హీరోతో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి కానీ ఎంతకీ ఆ సినిమాకు సంబంధించిన వార్తా బయటికి లేకపోవడంతో అసలు సంపత్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అని అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. తొందరగా సంపత్ నంది తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్లాప్ కొట్టిన దర్శకులు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ పోతుంటే తాను హిట్ కొట్టిన ఇంకా హీరోని ఎంపిక చేసుకోవడం పట్ల కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి సంపత్ నంది తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: