ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ జాతీయ ఉత్తమ నటిగా.. పేరు పొందింది ప్రియమణి. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ప్రియమణి.. ఒకవైపు బుల్లితెర.. మరొకవైపు వెండితెరపై కూడా మంచి అవకాశాలను అందుకుంటు బాగా దూసుకుపోతోంది ప్రియమణి. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది.తాజాగా ప్రియమణి భూమాకలాపం అనే ఒక సినిమాలో నటిస్తోంది.. అందుకు సంబంధించి తాజాగా టీజర్ కూడా విడుదల అవ్వడం జరిగింది.. దీనిని ఆహా ఓటిటి లో విడుదల చేయబోతున్నారు.


ఇంతకుముందు కూడా ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రియమణి దుర్గామాతను పోలీ ఉండే క్యారెక్టర్ లో బాగా ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.. ప్రియమణి ఈ సినిమాలో సరికొత్త పాత్ర ను ఎంచుకుంది అని చెప్పవచ్చు.టిజర్ విషయానికి వస్తే..తన జీవితంలో జరుగుతున్న విషయాల కంటే.. పక్కింట్లో జరిగే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టే తరహా పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది ప్రియమణి.. ఇందులో చాలా క్రైమ్ త్రిలింగ్ కు సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక ఇందులో భార్య భర్తల మధ్య ఎలాంటి కలతలు వస్తే.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అనే విధంగా ఈ సినిమా కథ ఉండబోతోంది అన్నట్లుగా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలోని ప్రియమణితో ఉన్న నటీనటులందరూ బాగా నటించారు అని చెప్పవచ్చు.

ఇక ఇందులో ప్రియమణి వంటలు చేసుకునే అమ్మాయి గా కనిపిస్తుంది.. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన బోతున్న ఈ సినిమాకి భామాకలాపం అనే టైటిల్ ని సెట్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని భరత్ కమ్మ సారథ్యంలో.. అభిమన్య డైరెక్షన్లో ఈ సినిమాని రూపొందించబడింది. ఈ సిరియా కి సంగీతం అందించింది జస్టిస్ ప్రభాకర్.. ఈ సినిమాకి కెమెరామాన్ గా దీపక్ కుమార్ అందించారు. మొత్తానికి టీజర్ తో అదరగొట్టేసింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: