చాలా మంది సినీ తారలు సమయం దొరికినప్పుడు లాంగ్ ట్రిప్ వేసుకోని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా అక్కడే గడుపుతుంటారు. హీరోయిన్లు ముఖ్యంగా మాల్దీవులలో ఎక్కువ స్పెండ్ చేస్తారు. అక్కడ వాతావరణం ఆహ్లాదంగా, చూడటానికి చాలా బాగుంటుంది.. ఈ మధ్య హీరోయిన్ల తో పాటుగా టీవీ సీరియల్ వాళ్ళు, యాంకర్లు కూడా ఇలానే మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదే అక్కడ ఒక ట్రెండ్ అవుతుంది. సినీ తారల అడ్డాగా మారింది.


ఒక వైపు కరోనా మహమ్మరి వేగంగా విజ్రుంభిస్తున్న నేపథ్యంలో కూడా మాల్దీవులలో హీరోయిన్ల సందడి మాత్రం ఎ మాత్రం తగ్గలేదు. సినిమా షూటింగ్ లు కూడా అక్కడ ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది.. పెళ్ళయిన వెంటనే కత్రీనాకు వరుస సినిమాలకు కమిటీ మెంట్ ఇచ్చింది.


ఇప్పుడు సమయం దొరకడం తో హనీమూన్ కు సిద్దమయ్యారు.ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక మాల్దీవుల్లో బీచ్ ఒడ్డున అమ్మడు ఎంతో అందంగా కనిపించింది.గ్రీన్ కలర్ డ్రెస్ లో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను నెటిజన్లు తమదైన స్తైల్లొ కామెంట్స్ పెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది అని, ఆ నవ్వులతోనే విక్కీని పడేసింది అని కామెంట్స్ పెడుతున్నారు.. కత్రీనా అందం అలాంటిది మరి..మరింత సమాచారం తెలుసుకోండి: