గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ గా కన్నా సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ మేనల్లుడు అంటే చాలా మందికి ఈజీగా అర్ధమవుతుంది. గల్లా అశోక్ మొదటి సినిమా ఆదిత్య శ్రీరాం డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దాదాపు ఈ సినిమా కోసం 23 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశారని టాక్. మొదటి సినిమా అది కూడా అసలు ఏమాత్రం పరిచయంలేని రంగంలోకి అడుగు పెట్టేప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అని తెలిసి కూడా తనయుడు కోసం భారీ బడ్జెట్ పెట్టేశారట.

గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హీరో సినిమా కు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. హీరో సినిమా బడ్జెట్ 20 కోట్ల పైనే ఖర్చు పెట్టారట. అయితే థియేట్రికల్ బిజినెస్ మాత్రం 6 కోట్లు మాత్రమే జరిగిందట. సంక్రాంతి బరిలో దిగిన గల్లా అశోక్ హీరో రిలీజై 10 రోజులు అవుతుండగా ఇప్పటి వరకు 4.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే వరల్డ్ వైడ్ గా హీరో సినిమా 2.28 కోట్ల షేర్ రాబట్టింది.

సినిమా థియేట్రికల్ బిజినెస్ రాబట్టాలన్నా సరే ఇంకా మూడున్నర కోట్ల దాకా వసూళ్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. గల్లా అశోక్ హీరో సినిమాలో నిధి అగర్వాల్ లాంటి ఇస్మార్ట్ హీరోయిన్ ఉన్నా సరే ఆమె సినిమా కు హెల్ప్ అవలేకపోయింది. గల్లా అశోక్ మొదటి ప్రాజెక్ట్ దాదాపు ఫెయిల్యూర్ గానే మిగిలేలా ఉంది. సినిమా ఎంటర్టైన్ మెంట్, మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వచ్చినా ఎందుకో ఆడియెన్స్ ని అలరించడం లో మాత్రం వెనకపడ్డదని చెప్పొచ్చు. డైరక్టర్ ఆదిత్య శ్రీరాం కు టాలెంట్ ఉన్నా సరే తీసిన సినిమాలను హిట్ గా మలచడంలో మాత్రం విఫలమవుతున్నాడు. హీరోతో మళ్లీ అతని ఖాతాలో మరో ఫ్లాప్ పడ్డది.    


మరింత సమాచారం తెలుసుకోండి: