కరోనా వైరస్ అసలు కనికరించడం లేదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఈ విషయంలో అయితే పగబట్టినట్లు గానే వ్యవహరిస్తుంది కరోనా వైరస్. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేదు. ఎంతో మంది సినీ సెలబ్రిటీల పై పంజా విసురుతున్న కరోనా వైరస్ అభిమానులందరినీ కూడా ఆందోళనలో ముంచెత్తుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులపై పంజా విసిరి కరోనా వైరస్ ప్రాణం తీసేసింది. దీంతో ఎంతో మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా సినీ సెలబ్రిటీల పై పంజా విసురుతుంది. ఇటీవలి కాలంలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు వరుసగా  వైరస్ బారిన పడుతుండటం గమనార్హం.


 ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి హీరో శ్రీకాంత్ సహా మరి కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా వైరస్ బారిన పడ్డారు. హోమ్ ఐ సొల్యూషన్ లో  ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ సింగర్ కరోనా వైరస్ బారిన పడ్డారు అన్నది తెలుస్తుంది. తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కౌసల్య  వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఇక లక్షణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని.. రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను.. కనీసం బెడ్ పై నుంచి కూడా లేవ లేక పోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


 ఈ క్రమంలోనే డాక్టర్ల సలహాలతో నిన్నటి నుంచి మందులు వేసుకోవటం మొదలు పెట్టాను అంటూ సింగర్ కౌసల్య చెప్పడం గమనార్హం. త్వరలోనే ఇక ఈ మహమ్మారి వైరస్ ను ఓడించి మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ చెప్పుకొచ్చింది సింగర్ కౌసల్య. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారందరూ కూడా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అంటూ కోరింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది సింగర్ కౌసల్య. అయితే తమ అభిమాన సింగర్ వైరస్ బారిన పడడంతో త్వరగా కోలుకోవాలని అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: